Site icon HashtagU Telugu

Bithiri Sathi : బీఆర్ఎస్ లోకి బిత్తిరి సత్తి..?

Bittiri Satti

Bittiri Satti

తెలంగాణ ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (COngress) పార్టీలలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓ పక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతుండగా..అదే స్థాయిలో అధికార పార్టీ లోకి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ శ్రేణులు చేరగా..తాజాగా ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి (Bithiri Sathi ) (అలియాస్‌ చేవెళ్ల రవికుమార్‌) సైతం బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.

ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీఆర్‌ఎస్, తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR), మంత్రి హరీశ్‌రావు (Harish Rao)తో బిత్తిరి సత్తి గురువారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ముదిరాజ్‌ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీష్ రావు కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు గాను సత్తి ఓకే చెప్పినట్లు సమాచారం. ముదిరాజ్‌ సామాజికవర్గానికి మరికొందరు కీలక నేతలు కూడా త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ముదిరాజ్ మహాసభ (Mudiraj Mahasabha) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో బిత్తిరి సత్తి ..బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. తాను ఒకప్పడు బిత్తిరి సత్తిగా మాట్లాడానని.. కానీ ఇప్పుడు ముదిరాజు రవికుమార్‌గా మాట్లాడుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో సీట్ల పంపిణీ విషయంలో ముదిరాజుల నేతలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ముదిరాజులకు టికెట్లు ఇవ్వలేకపోయామని, కానీ వారిని నామినేటెడ్ పోస్టులతో కడుపులో పెట్టుకుని చూస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారని, కానీ నామినేటెడ్ పోస్టులు చాలా సప్పగా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము (ముదిరాజులం) 60 లక్షల జనాభా ఉందనీ, 115 సీట్లలో ఒక్కటి కూడా ముదిరాజులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ముదిరాజ్ వర్గంలో ఏర్పడిన అసంతృప్తిని తొలగించేందుకు గులాబీ పార్టీ..ఇలా సత్తి ని దగ్గర చేసుకుంటున్నాయని..సత్తి బిఆర్ఎస్ లో చేరితే ముదిరాజు ఓట్లన్నీ కారుకే అని గులాబీ బాస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద సత్తి కార్ ఎక్కడం వల్ల బిఆర్ఎస్ కు ప్లస్ అని అంత అంటున్నారు.

Read Also : Lunar Eclipse 2023 in India : 9 ఏళ్ల తర్వాత పాక్షిక చంద్రగ్రహణం..దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..!