తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న తెలంగాణ ప్రజలు, అభిమానులు , బిఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. ఇక తెలంగాణ లో అయితే ఉదయం నుండే బర్త్ డే వేడుకలు అంబరాన్ని తాకాయి. రాజకీయ నేతలు , పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేకులు కట్ చేస్తూ , పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియా లో సైతం కేటీఆర్ బర్త్ డే ట్వీట్స్ హోరెత్తిస్తున్నాయి. సినీ ప్రముఖులు , బిజినెస్ రంగాల వారు కూడా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు బర్త్ డే విషెష్ (KTR Birthday Wishes) అందిస్తున్నారు.
ఇదిలా ఉంటె సంతోష్ అనే యువకుడు వినూత్నంగా కేటీఆర్ (KTR) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వార్తల్లో నిలిచారు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అని రాసి ఉన్న ఫ్లెక్సీ ని పట్టుకొని పారాషూట్ తో ఆకాశంలో విహరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసి పోస్టు చేశారు. దీనికి రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్. ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: Stop Eating Tomatoes : టమాటాలు తినడం మానేయమంటున్న బీజేపీ మంత్రి..