స్కూల్ డ్రెస్ వేసుకోలేదని చెప్పి..అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని (Girl Child who Wear Ayyappa Mala) స్కూల్ యాజమాన్యం లోనికి అనుమతించని ఘటన హైదరాబాద్ గండిపేట్ లో చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకమాసం లో పెద్ద ఎత్తున అయ్యప్ప మాలలు (Ayyappa Mala) వేసుకుంటారనే సంగతి తెలిసిందే. కేవలం పెద్ద వారే కాదు చిన్న పిల్లలు కూడా మాల ధరించి అయ్యప్ప ఫై ఉన్న భక్తిని చాటుకుంటారు. ఇలా ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాల ధరిస్తుంటారు. కొంతమంది పిల్లలు మాల డ్రెస్ తోనే స్కూల్స్ కు వెళ్తుంటారు. చాల స్కూల్స్ కూడా ఈ సమయంలో స్కూల్ డ్రెస్ కోడ్ ను వారిని మినహిస్తారు.
కాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని బండ్లగూడ (Bandlagooda) పరిధిలో ఉన్న బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ (Birla Open Minds International School ) యాజమాన్యం మాత్రం మాల వేసుకున్న చిన్నారిని గంట పాటు ఎండలో నిలబెట్టారు. అయ్యప్ప మాల ధరించిన చిన్నారి పూర్వీని స్కూల్‌లోకి స్కూల్ డ్రేస్ ఉంటేనే స్కూల్‌లోకి అనుమతి ఇస్తామని చెప్పి ఎండలో గంటపాటు బయట నిలబెట్టారు. తండ్రికి ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకొని స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. ఎందుకు రానివ్వరో చెప్పండి అంటూ స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడంతో తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడానికి ప్రయత్నింగా అలాటివేవి ఇక్కడి చెల్లవని చిన్నారి తండ్రిని యాజమాన్యం బెదిరింపులకు గురి చేశారు. విద్యార్థి తండ్రి ఆందోళన చేసినప్పటికి యాజమాన్యం ఎంతకి తగ్గకపోవడంతో.. చేసేదేమి లేక టీ షర్ట్ తీసుకొచ్చి పాపకు వేసి స్కూల్ లోపలికి పంపించాడు. ప్రస్తుతం ఈ విషయం మీడియా లో వైరల్ గా మారుతుంది. ఈ ఘటన కు పాల్పడిన స్కూల్ ఫై కఠిన శిక్షలు విధించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
రంగారెడ్డి – రాజేంద్రనగర్ బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం
అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ లోకి నో ఎంట్రీ.. స్కూల్ డ్రెస్ ఉంటేనే స్కూల్ లోకి అనుమతి అంటూ చిన్నారిని తోసేసిన యాజమాన్యం.
గంట పాటు ఎండలోనే నిలబడ్డ చిన్నారి. తన తండ్రి సమాచారం ఇచ్చిన యాజమాన్యం.
స్కూల్… pic.twitter.com/pxRi57u9qR
— Telugu Scribe (@TeluguScribe) December 11, 2023
Read Also : CM Revanth Reddy : మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న సీఎం రేవంత్