తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ …ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులతోపాటు టీచర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అంటూ పేర్కొంది.
అయితే స్కాలర్ షిప్, ఫీజురీయింబర్స్ మెంట్ ను రిలీజ్ చేసేందుకు, వారి హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు ఉపయోగపడుతుందని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది.