Site icon HashtagU Telugu

Bio Metric : గ్రూప్ 1 పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్…తొలిసారిగా అమలు..!!!

TSPSC

TSPSC

ఈనెల 16న నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షకు తొలిసారిగా బయోమెట్రిక్ అటెండెన్స్ ను అమలు చేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ చైర్మన్ బీ జనార్దనరెడ్డి వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లు గురించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1019 సెంటర్లలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తన్నట్లు తెలిపారు. ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. గంటన్నర ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 10.15గంటల తర్వాత అభ్యర్థులను లోపలికి అనుమతించమని జనార్థనరెడ్డి స్పష్టం చేశారు. ఇక అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ టీఎస్పీఎస్సీ అధికారి సమక్షంలో క్వచ్చన్ పేపర్ ఓపెన్ చేస్తామన్నారు. ఇది వీడియో తీస్తామని తెలిపారు. ఇక పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ముగిసిన 3రోజుల్లోగా మెయిన్ కీ ని వెబ్ సైట్లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామని జనార్ధనరెడ్డి తెలిపారు. ఈనెల 20 వతేదీలోపు కీని రిలీజ్ చేసి అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని చెప్పారు. ఆతర్వాత నిపుణుల కమిటీ ఫైనల్ కీని ప్రకటిస్తుందని చెప్పారు. గ్రూప్ 1 పరీక్ష రిజల్ట్స్ ను రెండు నెలల్లోగా విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే గ్రూప్ 2,4 నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version