BioAsia 2024: రూ.2000 వేల కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ తదుపరి దశను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే 1 లక్ష కోట్ల పెట్టుబడితో 10 ఫార్మా గ్రామాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం దీని వల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాలు , పారిశ్రామికవేత్తలకు అవకాశాలకు లభిస్తాయని సీఎం చెప్పారు. వీటితో పాటు 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పారు.
మంగళవారం 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే లైఫ్ సైన్సెస్‌కు హైదరాబాద్ తిరుగులేని రాజధాని అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో ప్రతి మూడు వ్యాక్సిన్‌లలో ఒకటి హైదరాబాద్‌లో తయారవుతుంది . గత 20 ఏళ్లలో బయోఏషియా భారతదేశం మరియు ఆసియా పసిఫిక్‌లను లైఫ్ సైన్సెస్‌లో కేంద్ర బిందువుగా ఉంచడంలో సహాయపడిందని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలోని మూడు వేర్వేరు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల కోసం ప్రభుత్వం క్లస్టర్‌లను గుర్తించింది. అందులో వికారాబాద్ , మెదక్ మరియు నల్గొండలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా గ్రామాలకు అనుగుణంగా ఉన్నట్టు చెప్పారు. తెలంగాణలోని ఈ మూడు విభిన్న దిశలపై దృష్టి సారించేందుకు వికేంద్రీకరణ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. దావోస్‌లో ఇటీవల ముగిసిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 40,232 కోట్ల పెట్టుబడి వచ్చాయని అన్నారు.
Also Read: Red Alert : పవర్ బ్యాంక్‌లు, యూఎస్‌బీలతోనూ చైనా గూఢచర్యం