Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్‌లో పట్టుబడిన బైక్‌ దొంగలు

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో బైక్ దొంగలు పట్టుబడ్డారు. సుల్తాన్ బజార్ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు.  సుల్తాన్ బజార్ పోలీస్ ఎస్‌ఐ మరియు క్రైమ్ సిబ్బంది కాచిగూడ ఎక్స్ రోడ్‌లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గుంజి రామాంజనేయులు, గోగుల గోపాల కృష్ణ, షేక్ కాశినపల్లి బాషా అనే బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు.

నిందితులను విచారించగా సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఒక కేసు, గోపాలపురం పీఎస్‌లో ఒకటి , హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో ఒకటి , సూర్యాపేట జిల్లా చింతలపాలెం పీఎస్‌లో ఒక కేసు , సూర్యాపేట 2వ టౌన్‌లో ఒకటిగా ఐదు నేరాలు చేసినట్లు నిందితులు స్వచ్ఛందంగా అంగీకరించారు. సూర్యాపేట జిల్లాలో 4బుల్లెట్ మోటార్‌సైకిళ్లు మరియు 1 హీరో డీలక్స్ మోటార్‌సైకిల్‌ , మొత్తం 8 లక్షలకు పైగా విలువైన వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాకు చెందిన వారుగా తెలుస్తుంది.

హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగతనానికి పాల్పడతారు. దొంగిలించిన వాహనాలను ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లోని పార్కింగ్ స్థలంలో ఉంచారు. ఇదే పద్ధతిలో సూర్యాపేట జిల్లాకు వెళ్లి బుల్లెట్, హీరో డీలక్స్ మోటార్‌సైకిళ్లను చోరీకి పాల్పడ్డారు. ఈరోజు నిందితులు దొంగిలించిన వాహనాలపై హైదరాబాద్ కింగ్ కోటిలో విక్రయించేందుకు వెళ్లి పోలీసులకు పట్టుబడ్డారు.

Also Read: Health Tips: మీ ఇంటి పరిసరాల్లో ఈ మొక్క కనిపించిందా.. అయితే అసలు వదలకండి?

Exit mobile version