Site icon HashtagU Telugu

KCR Nitish Kumar : కేసీఆర్ ఎఫెక్ట్‌, బీహార్లో రాజ‌కీయ అల‌జ‌డి

Kcr Nitish

Kcr Nitish

తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లిన 24 గంట‌ల్లోనే ఆయ‌న లెగ్ ప్రభావం అక్క‌డి ప్ర‌భుత్వంపై ప‌డింది. బీహార్ స‌ర్కార్లోని మంత్రి కార్తికేయ సింగ్ రాజీనామా చేశారు. ఆయ‌న సీఎం నితీష్ కు రాజీనామా ప‌త్రాన్ని అందించారు. తొలి వికెట్ ప‌డింద‌ని బీహార్ బీజేపీ కామెంట్ల‌ను మొద‌లుపెట్టింది. మ‌రిన్ని వికెట్లు ప‌డ‌తాయ‌ని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ జోస్యం చెబుతున్నారు. మొద‌టి ఓవ‌ర్లోనే నితీష్ ` క్లీన్ బౌల్డ్ ` అవుతార‌ని ప్ర‌తిప‌క్షం అంటోంది.

వాస్త‌వంగా న్యాయ‌శాఖ మంత్రిగా ఉన్న కార్తికేయ్ సింగ్ పై కిడ్నాప్ నిందిడిగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాంటి వ్య‌క్తిని న్యాయ‌శాఖ మంత్రిగా ఎలా నియ‌మిస్తార‌ని ప్ర‌తిప‌క్ష బీజేపీ నిల‌దీసింది. దీంతో న్యాయ‌శాఖ నుంచి స‌హ‌కార‌శాఖ మంత్రిగా ఆయ‌న్ను నియ‌మిస్తూ నితీష్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ వెంట‌నే కార్తికేయ్ సింగ్ రాజీనామా ప‌త్రాన్ని సీఎంకు పంపారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదించి, గవర్నర్ ఫాగు చౌహాన్‌కు పంపింది. బీహార్‌లో అలీ బాబా చాలీస్ చోర్ ప్రభుత్వం నడుస్తోం ఎమ్మెల్యే నిరజ్ కుమార్ బబ్లూ ఆరోప‌ణ‌ల‌కు దిగారు. మాజీ మంత్రి , బిజెపి ఎమ్మెల్యే అలోక్ రంజన్ మాట్లాడుతూ నేర నేపథ్యం ఉన్న నాయకులకు మంత్రి పదవులు ఇచ్చార‌ని సీఎం నితీష్ కుమార్ పై విరుచుప‌డుతున్నారు. అటు అధికార‌, ప్ర‌తిప‌క్షం మ‌ధ్య మంత్రి రాజీనామా వ్య‌వ‌హారం ర‌చ్చ‌గా మారింది.

గ‌తంలోనూ సీఎం కేసీఆర్ మ‌హారాష్ట్ర వెళ్లిన కొన్ని రోజుల‌కు అక్క‌డి ఉద్ద‌వ్ ప్ర‌భుత్వం ప‌డిపోయింది. ఆ త‌రువాత ఆయ‌న జార్ఖండ్ వెళ్లారు. అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఎప్పుడు ప‌డిపోతుందో తెలియ‌ని అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. సీఎంగా కుమార‌స్వామి ఉన్న‌ప్పుడు క‌ర్ణాట‌క‌కు కేసీఆర్ వెళ్లారు. ఆ త‌రువాత కుమారస్వామి ప్ర‌భుత్వం ప‌డిపోయింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఇటీవ‌ల కేసీఆర్ క‌లిశారు. ఆ త‌రువాత లిక్క‌ర్ స్కామ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వెళ్లారు. అక్క‌డ మ‌మ‌త ఓడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే, కేసీఆర్ వెళ్లిన ప్ర‌తి రాష్ట్రంలోనూ రాజ‌కీయ అల‌జ‌డి రేగుతోంది. ఇదంతా గ‌మ‌నిస్తే చూస్తే, కేసీఆర్ ప్ర‌భావం ఆయా రాష్ట్రాల‌పై ఎలా ప‌డుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.