Big War in Congress : ఉత్త‌మ్, రేవంత్ మ‌ధ్య ఓ టీవీ ఛాన‌ల్ , వార్ షురూ!

Big war in Congres :`రికార్ట్ చేయ్, రేవంత్ రెడ్డి మాట విని రూమ‌ర్స్ క్రియేట్ చేసి న్యూస్ వేయొద్ద‌ని మీ ఓన‌ర్ విజ‌య్ క్రాంతి రెడ్డికి చెప్పు`

  • Written By:
  • Updated On - June 27, 2023 / 03:00 PM IST

(Big war in Congress) : `రికార్ట్ చేయ్, రేవంత్ రెడ్డి మాట విని రూమ‌ర్స్ క్రియేట్ చేసి న్యూస్ వేయొద్ద‌ని మీ ఓన‌ర్ విజ‌య్ క్రాంతి రెడ్డికి చెప్పు` అంటూ మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఒక ప్రైవేటు యూట్యూబ్ ఛాన‌ల్ చైర్మ‌న్ కు (Big war in Congres) హిత‌వు ప‌లికారు. అంటే, కాంగ్రెస్ లోని అంత‌ర్గ‌త గ్రూప్ లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అంతా క‌లిసిపోయామ‌నే సంకేతం ఢిల్లీ కేంద్రంగా ఇచ్చిన‌ప్ప‌టికీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీలోని సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నార‌ని ఉత్త‌మ్ తాజా వ్యాఖ్య‌ల ఆధారంగా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

రేవంత్ రెడ్డిపై  సీనియ‌ర్లు గుర్రుగా.. (Big war in Congres) 

నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ పార్టీ పైకి మాత్రం భేషుగ్గా క‌నిపిస్తోంది. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా ముందుకొచ్చారు. నాలుగేళ్లుగా బాధ‌ప‌డుతూ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నాన‌ని వెల్ల‌డించారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లాంటి పెద్ద‌మ‌నిషిని సోష‌ల్ మీడియా వేదిక‌గా  (Big war in Congress)  ఎంత డ్యామేజ్ చేస్తున్నారో చూడండి అంటూ నిట్టూర్చారు.

Also Read : KCR and Modi relation : విప‌క్షాల మీటింగ్ కు `నో ఇన్విటేష‌న్‌`, BJP బీ టీమ్ గా BRS కు ముద్ర‌!

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌నుషులు ఉద్దేశ‌పూర్వ‌కంగా సీనియ‌ర్ల‌పై రూమ‌ర్స్ క్రియేట్ చేస్తూ పార్టీకి న‌ష్టం చేస్తున్నార‌ని జ‌గ్గారెడ్డి అన‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లోనే రాహుల్ గాంధీని క‌లిసి పార్టీ ప‌రిస్థితిని వివ‌రిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఒక వేళ కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రాక‌పోతే కొంద‌రి జీవితాలు తారుమారు అవుతాయ‌ని ఆందోళ‌న చెందారు. అందుకే, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

రేవంత్ రెడ్డి స్నేహితుడు యూ ట్యూబ్ ఛాన‌ల్ గురించి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ ఫైట్

ఢిల్లీ కేంద్రంగా ఐక్యంగా క‌నిపించిన కాంగ్రెస్ సీనియ‌ర్లు తెల్లారేస‌రికి రివ‌ర్స్ వాయిస్ ను వినిపిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద వ్య‌తిరేక గ‌ళం విప్పుతున్నారు. ఒక ఛాన‌ల్, కొన్ని యూ ట్యూబ్ ఛాన‌ళ్లు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయ‌ని ఉత్త‌మ్ వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేకించి ఒక ప్రైవేటు టీవీ గురించి ఆయ‌న బాహాటంగా మాట్లాడారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ల మీద గాలిపోగుచేసి ఆ టీవీ న్యూస్ ఇస్తుంద‌ని ఆరోపించారు. దానికి ఆ టీవీ ఛాన‌ల్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్లు మాత్రం రేవంత్ రెడ్డి.(Big war in Congress)  వాల‌కాన్ని త‌ప్పుబడుతున్నారు.

ఉత్త‌మ్  కుమార్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా దూషిస్తూ పెట్టిన పోస్టులు(Big war in Congress) 

తొలి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు అధిష్టానంకు స‌మాచారం చేర‌వేస్తున్నారు. సుదీర్ఘ‌కాలం పాటు పీసీసీ ప‌ద‌విని ఆయ‌న నిర్వ‌హించారు. ఆ అనుభ‌వంతో అధిష్టానంకు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ వ్య‌వ‌హారాన్ని చేర‌వేస్తున్నార‌ని కొంద‌రి అనుమానం. అందుకే, ఆయ‌న్ను కో వ‌ర్ట్ కింద న్యూస్ పెడుతూ సోష‌ల్ మీడియా వేదికగా గంద‌ర‌గోళం సృష్టించారు. ఆ క్ర‌మంలో తెలంగాణ సీఐడీ ఒకానొక స‌మ‌యంలో రంగంలోకి దిగింది. కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం కింద కొంద‌రు రేవంత్ రెడ్డి వ‌ర్గీయులు నిర్వ‌హిస్తోన్న డేటా సెంట‌ర్ మీద దాడులు చేసింది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా దూషిస్తూ పెట్టిన పోస్టులు  (Big war in Congress)  అక్క‌డి నుంచే వ‌చ్చాయ‌ని తేల్చింది.

Also Read : Telangana Congress: క‌ర్ణాట‌క ఫార్ములా షురూ.. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే మ‌హిళలందరికీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్రయాణం .

తాజాగా రేవంత్ రెడ్డి స్నేహితుడు నిర్వ‌హిస్తోన్న యూ ట్యూబ్ ఛాన‌ల్ గురించి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ ఫైట్ కు దిగారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లో ఆ టీవీ న్యూస్ వండివార్చుతుందంటూ ఢిల్లీ వేదిక‌గా మండిప‌డ్డారు. తొలి నుంచి రేవంత్ రెడ్డి మీద చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను ఇప్పుడు ఆధారాల‌తో నిరూపించ‌డానికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వాయిస్ పెంచారు. ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా జ‌గ్గారెడ్డి కూడా మీడియా ముందుకొచ్చారు. ఎన్నిక‌లంటే 20 కోట్లు, 30 కోట్లు పెట్టే వాళ్ల‌క‌న్నంటూ రాజ‌కీయాన్ని త‌యారు చేశార‌ని ప‌రోక్షంగా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యంగా లీడ‌ర్లు ఉన్నార‌ని చెప్ప‌లేన‌ని అన్నారు. మొత్తం మీద అటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇటు జ‌గ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద రివ‌ర్స్ వాయిస్  (Big war in Congress)  వినిపిస్తున్నారు. వాళ్లిద్ద‌రూ బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నార‌ని వ‌చ్చిన రూమ‌ర్స్ కు బ‌లం చేకూరేలా వాళ్ల తాజా గ‌ళం ఉంద‌ని రేవంత్ వ‌ర్గీయులు భావిస్తున్నారు.

Also Read : KCR Strategy: కేసీఆర్ ‘కాపు’ రాజకీయం.. కాపు భవన్ తో ఆంధ్రులకు గాలం!