తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో చోటుచేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు (Tejeshwar Murder Case) ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతుంది. మొదట ఇది సాధారణ గొడవ వల్ల జరిగిన హత్య అనుకున్నా, విచారణలో నిందితుడు తిరుమలరావు (Tirumalarao) అనేక సంచలన విషయాలను బయటపెట్టాడు. అతడు ముందుగా తన భార్యను హత్య చేయాలనే పథకంతో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భార్యను చంపి, తన ప్రేయసి ఐశ్వర్యతో కలిసి లద్దాఖ్ లో కొత్త జీవితం ప్రారంభించాలనేదే అతని అసలు ప్లాన్.
Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ జై షాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!
ఈ కుట్రను అమలు పరచేందుకు తిరుమలరావు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాడు. రూ. 20 లక్షల బ్యాంకు రుణం తీసుకొని, బయటి ప్రపంచానికి తమ ప్రేమకథపై ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ భార్యను హత్య చేయడం సాధ్యపడకపోవడంతో, ఆమెకు అండగా ఉన్న తేజేశ్వర్‌ను లక్ష్యంగా మార్చాడు. చివరికి అతన్ని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనపై తేజేశ్వర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Amrapali IAS : మళ్లీ తెలంగాణకే ఆమ్రపాలి
మరోవైపు ఐశ్వర్య అన్న నవీన్ కూడా రెండు నెలల క్రితం ఇంట్లో జారి మృతి చెందిన ఘటనపై ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇది సహజ మృతి కాదేమో అన్న అనుమానంతో పోలీసులు ఆ కేసును కూడా తిరిగి తెరిచి దర్యాప్తు చేస్తున్నారు. తేజేశ్వర్ హత్య కేసు కేవలం వ్యక్తిగత ద్వేషంతో కాదు, ప్రేమ, స్వార్థం, హత్యలతో కూడిన పెద్ద కుట్ర అని ఇప్పుడు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.