Site icon HashtagU Telugu

BRS : కేటీఆర్‌, కండియంల‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన రాజ‌య్య‌.. టికెట్ విష‌యంలో..?

Rajaiah Vs Kadiam

Rajaiah Vs Kadiam

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో రాజ‌కీయం మ‌రోమ‌లుపు తిరిగింది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కు కాకుండా క‌డియం శ్రీహ‌రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. అయితే రాజ‌య్య‌ను బుజ్జ‌గించేందుకు మంత్రి కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఇటీవ‌ల రాజ‌య్య‌ను, క‌డియం శ్రీహ‌రిల మధ్య రాజీ కుదిరింద‌ని ఇద్ద‌రు క‌లిసిపోయిన‌ట్లు ఫోటోలు బ‌య‌టి వ‌చ్చాయి. అయితే క‌డియం, కేటీఆర్‌ల‌కు రాజ‌య్య బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. . రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి మరోసారి పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం తనకు బీ-ఫారం ఇవ్వవచ్చని బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన‌ ప్రకటన నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.

నియోజకవర్గంలోని స్టేష‌న్ ఘన్‌పూర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని రాజీ చేసి అంగీకరించారని, వచ్చే ఎన్నికల్లో శ్రీహరికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని వస్తున్న వార్తలను రాజయ్య ఖండించారు. మంత్రి కేటీర్‌ ఎమ్మెల్యే టిక్కెట్లు ప్రకటించే సమయానికి అమెరికాలో ఉన్నారు. అయితే ఆయ‌న తిరిగి వ‌చ్చిన త‌రువాత ఇటీవ‌ల ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిసేందుకు రాజ‌య్య వెళ్లారు. ఆ సమయంలో కడియం శ్రీహరి, ఇతర నేతలు కూడా ఉన్నారు. అందరూ కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు.

ఎమ్మెల్యే టికెట్ విషయంలో రాజీ పడలేద‌ని.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తప్పకుండా మార్పులు ఉంటాయ‌ని రాజ‌య్య తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా త‌న‌ పేరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. త‌న‌ను కేటీఆర్‌ అభినందిస్తున్నారని.. తన నియోజకవర్గంలో మంచి పనులను కొనసాగించాలని కేటీఆర్ కోరిన‌ట్లు రాజ‌య్య తెలిపాఉ.త‌న‌కు చైర్మన్ పదవి, ఎంపీ లేదా ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చినా. తాను కేటీఆర్ ప్రతిపాదనను అంగీకరించలేదని.. ఎమ్మెల్యేగా కొనసాగాలనుకుంటున్నట్లు ఆయనకు తెలియజేసినట్లు తెలిపారు.

గత కొన్ని నెలలుగా ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రులు రాజయ్య, శ్రీహరి పరస్పరం వ్యతిరేక ప్రకటనలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో తమ ఆధిక్యతను చాటుకునేందుకు సభలు కూడా నిర్వహిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి వచ్చే ఎన్నికల్లో తామే పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ఇద్దరూ చెప్పుకుంటున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన తొలి జాబితాలో స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కడియం శ్రీహరి పేరు వచ్చింది. అయితు ఇరువురు మ‌ధ్య రాజీ కుదిరిందనే వార్తలు వచ్చినప్ప‌టికీ.. స్టేషన్‌ఘన్‌పూర్‌ సీటును వదులుకునే ఆలోచనలో తాను లేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.