Site icon HashtagU Telugu

Teegala Krishna Reddy: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి ‘తీగల’

Teegala

Teegala

అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారాస కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితతో కలిసి తీగల హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ మేరకు భారాస నుంచి కాంగ్రెస్‌లోకి చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయా నియోజకవర్గాలో టికెట్స్ దక్కించుకునేందుకు ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తున్నారు. అధిష్టానం ఎటు తేల్చలేకపోతుండటంతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టికెట్ ఇస్తారా? వేరే పార్టీలోకి వెళ్లమంటారా? అంటూ పరోక్షంగా వార్నింగ్ లు ఇస్తున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు BRSకి మారిన నియోజకవర్గాలలో పోరు తీవ్రంగా ఉంది. అంతేకాదు.. ఎన్నికల టిక్కెట్ల కోసం GHMC కార్పొరేటర్లు సైతం పోటీ పడుతున్నారు. రాబోయే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వకపోతే BRS నాయకులు కాంగ్రెస్ లేదా BJPలో చేరాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి నుంచి తీవ్ర పోటీ ఉండటంతో తీగల కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: Errabelli Dayakar Rao: కేసీఆర్ సీఎం అయ్యాకే రైతుల క‌ళ్ళ‌ల్లో ఆనందం