Site icon HashtagU Telugu

Kasani Gnaneshwar: టీటీడీపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్ పార్టీలోకి కాసాని జ్ఞానేశ్వర్?

Kasani

Kasani

Kasani Gnaneshwar: ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో పాటు చేరికల పర్వం కూడా తారాస్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణలో పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లు ఒక్కింత నిరాశకు గురయ్యారు. ఇక పార్టీ అధ్యక్షుడు కాసాని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతోనే కాసాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ సమక్షంలో రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డితో పోటీ చేస్తుండటం, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ అక్కడి ముదిరాజ్ కులస్తులు ఛాలెంజ్ చేయడం లాంటివి చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కాసానితో చర్చలు జరిపి ఉండవచ్చునని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ కాసాని కనుక బీఆర్ఎస్ పార్టీలో చేరితే తెలంగాణలో టీడీపీ పార్టీకి గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉంది. ఇదే సమయంలో ముదిరాజ్ ఓట్లతో  అటు గజ్వేల్, ఇటు కామారెడ్డిలో కేసీఆర్ బలం పెరిగే అవకాశం కూడా ఉంది.

Also Read: Revanth Reddy: డీజీపీ అంజనీకుమార్‌ ని వెంటనే తొలగించాలి