Site icon HashtagU Telugu

BRS Tickets: రాజయ్యకు బిగ్ షాక్, కడియం ను ఖరారు చేసిన కేసీఆర్

Rajaiah Vs Kadiam

Rajaiah Vs Kadiam

హనుమకొండ: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Rajaiah) తెలంగాణ రాజకీయాల్లో కొద్దిరోజులుగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ అండదండలతో, కేటీఆర్ ఆశీస్సులతో తనకే టికెట్ వస్తుందని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఫస్ట్ లిస్టులో రాజయ్య పేరు లేకపోవడంతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్టయింది. తనకే టికెట్ వస్తుందని ఆశించిన రాజయ్య కు ఊహించని దెబ్బ తగిలింది. అయితే స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరికి మంచి పేరుండటం, ఇతర నేతలు కూడా కడియం వైపు మొగ్గు గులాబీ బాస్  రాజయ్యను పక్కన పెట్టేశాడు.

ఇక రాజయ్యపై అవినీతి ఆరోపణలు ఉండటం ఒక కారణమైతే, సర్పంచ్ నవ్య రాజయ్యపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట దెబ్బతింది. ఇక దళిత బంధులో కూడా రాజయ్య అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.  చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారనే విమర్శలు వినిపించాయి. అందుకే రాజయ్యను పక్కన పెట్టి ఉండవచ్చునని స్థానిక బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నారు.

ఇటీవల రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. రాజయ్య ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. కడియం శ్రీహరి తల్లి, కూతురిపై రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆయన అవినీతి తిమింగలం అంటూ వ్యాఖ్యానించాడు. మంత్రిగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి చేసిన అవినీతి అంతా ఇంతా కాదన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో అందినకాడికి దోచుకుని మలేషియాలో ఆస్తులు కూడబెట్టాడు అంటూ ఆరోపించాడు. అయితే ఎమ్మెల్యే రాజయ్య ఆరోపణలపై కడియం శ్రీహరి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాను సౌమ్యుడనని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నానని కడియం వినమ్రంగా మసులుకున్నాడు. టికెట్ ఫైట్ లో చివరకు అధిష్టానం కడియం వైపు మొగ్గు చూపడం గమనార్హం.

టికెట్ పోయిన BRS ఎమ్మెల్యేలు

సుభాష్ రెడ్డి – ఉప్పల్

రాజయ్య – స్టేషన్ ఘనపూర్

రాములు నాయక్ – వైరా

రేఖా నాయక్ -ఖానాపూర్

చెన్నమనేని రమేష్ – వేములవాడ

గంప గోవర్ధన్ -కామారెడ్డి

రాథోడ్ బాపురావు -బోధ్

విద్యాసాగర్ రావు – కోరుట్ల ( అభ్యర్థిగా కుమారుడు)

Also Read: KCR Contest: కామారెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ పోటీ