TS Elections: జనసేన పార్టీకి బిగ్ షాక్, 8 చోట్లా డిపాజిట్ గల్లంతు!

ప్రస్తుత తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తిగా తేలిపోయింది.

  • Written By:
  • Updated On - December 3, 2023 / 01:25 PM IST

TS Elections: ప్రస్తుత తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తిగా తేలిపోయింది. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతమాత్రము లేదు అనేది స్పష్టమైంది. పోటీ చేసినా 8 చోట్లా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదంటే జనసేన పార్టీ పరిస్థితి ఏవిధంగో అర్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేసినా ప్రభావం పెద్దగా లేదు.

కూకట్‌పల్లిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అక్కడ జనసేనకు ఇప్పటివరకూ 14,954 ఓట్లు వచ్చాయి. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేటల్లో ఎక్కడా ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ దెబ్బకు రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ పార్టీలు సైతం నిలువలేకపోయాయంటే కాంగ్రెస్ జోరు ఏవిధంగా ఉందో ఇట్టే అర్ధమవుతోంది.

కాంగ్రెస్ హవా కారణంగా జనసేన లాంటి పార్టీలు చిత్తు చిత్తు అయ్యాయని రాజకీయ పార్టీల విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఏపీలో టీడీపీ తో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీపై తెలంగాణ ఎన్నికల ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నెక్ట్స్ స్టెప్ ఏంటి? అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Komatireddy: తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి