Site icon HashtagU Telugu

TCongress: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి అలంపూర్ ఎమ్మెల్యే జంప్!

Alampur

Alampur

TCongress: పోలింగ్ సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. వరుస సభలు, సమావేశాతో పాటు చేరికలపై గురి పెడుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తికి లోనైన అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్రహం ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరిపోయారు.. టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న హ‌స్తం గూటికి వ‌చ్చారు.. హైద‌రాబాద్ లోని రేవంత్ నివాసంలో అబ్ర‌హంకు పార్టీ కండువా క‌ప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

కాగా, బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముందుగా ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ లో ఆలంపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు వుంది. దీంతో ఆయన ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో బిజీబిజీగా వున్నారు. సరిగ్గా నామినేషన్ కోసం సిద్దమవుతున్న అబ్రహంకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ను క్యాన్సిల్ చేసి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి కేటీఆర్ భీఫామ్ అందించారు.

దీంతో అబ్రహంతో పాటు ఆయన వర్గం షాక్ కు గురయ్యింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు ఆలంపూర్ టికెట్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న అబ్ర‌హం కు ఏఐసిసి కార్యదర్శి, ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ సంప్ర‌దింపులు జ‌రిపారు. తన గెలుపు కోసం సహకరిస్తే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఇస్తామని ఒప్పించారు. కాగా గ్రామస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Also Read: Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్, మరో 3 రోజులు వర్షాలు