Site icon HashtagU Telugu

BJP : తెలంగాణలో బిజెపికి భారీ షాక్..కాంగ్రెస్లోకి కీలక నేతలు

Bjp No Cases

Bjp No Cases

లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి (BJP) పార్టీకి భారీ షాక్ తగలింది. ఇద్దరు కీలక నేతలు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల వేడి కాకరేపుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోనూ అదే విధంగా విజయయాత్ర కొనసాగిచాలని , 17 కు 17 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తుంది. అటు బిజెపి , బిఆర్ఎస్ పార్టీలు సైతం లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి గట్టిగా వీస్తుండడం తో లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ప్రజలు , నేతలు నమ్ముతున్నారు. అందుకే ఇతర పార్టీల నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే వలసల పర్వం కొనసాగిందో..అంతకు మించి గత రెండు నెలలుగా వలసలు నడుస్తున్నాయి. కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతల దగ్గరి నుండి కింది స్థాయి నేతల వరకు అంత కాంగ్రెస్ బాట పడుతున్నారు. మొన్నటి వరకు బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరగా..తాజాగా ఈరోజు బిజెపికి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు (Pulimamidi Raju) తో పాటు మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి (Jalandhar Reddy) లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డిలు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు.

Read Also : Wrong UPI Transaction: మీరు యూపీఐ ద్వారా రాంగ్ నంబ‌ర్‌కు డ‌బ్బు పంపారా..? అయితే ఇలా చేయండి..!