Bandi Sanjay: బండికి బిగ్ షాక్.. సంజయ్ సెగ్మెంట్లలో బీజేపీ ఘోరపరాజయం!

కర్ణాటక ఎన్నికల బరిలో బండి సంజయ్ ప్రచారం చోటా బీజేపీ ఘోరంగా ఓడిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Bandi sanjay bus yatra

Bandi Padayatra

కర్ణాటక ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే అత్యధిక స్థానాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకొని బీజీపీకి బిగ్ షాక్ నిచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ లో సంతోషం నింపితే, బీజేపీలో తీవ్ర నైరాశ్యం నింపింది. ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంబురాలు చేసుకుంటుంటే.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా ముందుకు రాలేని పరిస్థితి. ఆయన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఏవిధంగా స్పందిస్తారోనని అటు బీజేపీ శ్రేణులు, ఇటు ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల బరిలో బండి సంజయ్ ప్రచారం చోటా బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. బండి సంజయ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీకి 3వ, 5వ స్థానాల్లో ఘోర పరాజయం పొందింది. బండి సంజయ్ ప్రచారం చేసిన చింతామణి, ముల్బగల్, బాగేపల్లి, గౌరీబిదనూర్, చిక్కబల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఘోర పరాభవం దిశగా కొనసాగుతుంది.

బండి ప్రచారం చేసిన స్థానాలివే

👉గౌరీబిదనూర్ బీజేపీ 5వ స్థానం
👉చింతామణిలో బీజేపీ 3వ స్థానం
👉ముల్బగల్ బీజేపీ 3వ స్థానం
👉బాగేపల్లి బీజేపీ ఓటమి దిశగా
👉చిక్కబల్లాపూర్ బీజేపీ ఓటమి దిశగా

Also Read: Karnataka Results: తెలంగాణలో కర్ణాటక రిజల్ట్స్ రిపీట్.. గెలుపుపై రేవంత్ ధీమా

  Last Updated: 13 May 2023, 04:15 PM IST