Babu Mohan : బిజెపికి రాజీనామా చేసిన బాబూమోహన్‌

  • Written By:
  • Updated On - February 7, 2024 / 04:19 PM IST

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బీజేపీ పార్టీ (BJP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ కి అందోల్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్‌ (Babu Mohan resigns from BJP) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. రేపు రాజీనామ లేఖ పంపుతాను. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తా’ అని బాబు మోహన్‌ వెల్లడించారు. మరి ఏ పార్టీ లో చేరతారనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఇక మొదటి నుండి బాబు మోహన్ బిజెపి పార్టీ తీరు ఫై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన బీజేపీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో అందోల్ నియోజకవర్గంలో బిజెపి తరుపున బరిలోకి దిగగా..మూడో స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్‌ తరఫున బరిలో నిల్చున్న దామోదరం రాజనరసింహ విజయం సాధించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బాబు మోహన్ రాజకీయ ప్రస్థానం చూస్తే..బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో ఆయన టీడిపి పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించాడు. 2019 లో బీజేపీ లో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిపోయాడు. ఇక 2023 ఎన్నికల్లోనూ అలాగే ఓటమి చెందారు.

Read Also : Bandi Sanjay : ఈటెల కు నాకు ఎలాంటి గొడవలు లేవు..బండి సంజయ్ క్లారిటీ