Numaish: నుమాయిష్ కు బిగ్ రెస్పాన్స్.. ఈ ఏడాది ఎన్ని లక్షల మంది విజిట్ చేశారో తెలుసా

  • Written By:
  • Updated On - February 19, 2024 / 05:35 PM IST

Numaish: అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ కు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 49 రోజలు నిర్వహించారు. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిబిషన్‌ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక వసూలు చేసి వాహనాలను అనుమతించారు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 49 రోజులుగా జరిగిన నుమాయిష్‌ ముగిసింది. దాదాపు 24 లక్షల మంది సందర్శకులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. చివరి రోజు దాదాపు 80 వేల మందిపైగా పైగా వచ్చారు.  నుమాయిష్‌కు సహకరించిన అధికారులు, స్టాల్‌ నిర్వాహకులు, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు గోల్డ్‌ మెడల్‌, ప్రశంసాపత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు.

గతంలో ఇందు కోసం రూ.600 వసూలు చేశారు. సాధారణ సందర్శకులను ప్రతి రోజూ సాయంత్రం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి అనుమతించారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్‌, కార్యదర్శి హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి చంద్రజిత్‌సింగ్‌, కోశాధికారి ఏనుగుల రాజేందర్‌కుమార్‌ నేతృత్వంలో ప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు.