కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)కు సంబంధించిన వివాదంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal)కు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. ఈ రిపోర్టులో తన పేరును అనవసరంగా ప్రస్తావించారని, దానిని తొలగించాలని స్మితా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Good News : తగ్గిన సిమెంట్ ధరలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వెలువడిన తరువాత అనేక అధికారుల పేర్లు బయటకొచ్చాయి. ఇందులో స్మితా సబర్వాల్ పేరు కూడా ఉండటంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో తనకు నేరుగా సంబంధం లేదని వాదిస్తూ, ఈ రిపోర్ట్ కారణంగా తన ప్రతిష్ట దెబ్బతింటోందని ఆమె కోర్టులో విన్నవించారు.
హైకోర్టు ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి, తాత్కాలికంగా ఆమెకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 7న జరగనుంది. అప్పటివరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా పేర్కొంది. దీంతో స్మితా సబర్వాల్‌కు ఈ ఆదేశాలు పెద్ద ఊరటగా నిలిచాయి.