Site icon HashtagU Telugu

KCR: కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్.. రైల్ రోకో కేసులో విచారణపై హైకోర్టు స్టే

Kcr (2)

KCR:  మాజీ సీఎం కేసీఆర్‌కు పెద్ద ఊరట లభించింది. 2011 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా మల్కాజిగిరి  పరిధిలో జరిగిన రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్నందుకు కేసీఆర్‌పై ఓ కేసు నమోదైంది. తనపై నమోదైన ఆ కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో కేసీఆర్‌పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

2011 సంవత్సరంలో మల్కాజిగిరి పరిధిలో రైల్ రోకో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా కేసీఆర్‌పై(KCR) కేసు నమోదైంది. అయితే  తాను ఆ నిరసనలో పాల్గొనలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అది తప్పుడు కేసు అని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. రైల్ రోకో నిరసనలో కేసీఆర్ పాల్గొనకున్నా.. దానిలో ఆయన పేరును 15వ నిందితుడిగా చేర్చారని హైకోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ధర్మాసనం కేసీఆర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణపై స్టే విధించింది.తదుపరి విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : Om Birla : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఎన్డీయే అభ్యర్థిగా ఓంబిర్లా.. ‘ఇండియా’ అభ్యర్థిగా కె.సురేష్

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 సంవత్సరం అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో మల్కాజిగిరి పరిధిలో కేసీఆర్ రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ అప్పట్లో కేసు నమోదైంది. రైల్ రోకో కారణం వల్ల ట్రైన్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని.. దీనివల్ల రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిందనే అభియోగాలను నమోదు చేశారు. నాటి నుంచి కేసీఆర్‌పై  ఆ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆనాటి కేసును కొట్టేయాలంటూ కేసీఆర్ సోమవారం ( జూన్ 24) హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తాను ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని తేల్చిచెప్పారు. ఎట్టకేలకు ఆయన ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది.

Also Read : WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఇన్ యాప్ డయలర్ ఫీచర్?