Viveka Murder Case : అవినాష్ రెడ్డి కి భారీ ఊరట

వివేకానందరెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది

  • Written By:
  • Publish Date - May 3, 2024 / 11:11 AM IST

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (Y. S. Avinash Reddy) కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో భారీ ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య (Murder of Vivekananda Reddy
) కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డిని ఐదేళ్ల క్రితం అతి దారుణంగా తన ఇంట్లోనే హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో 8వ నిందితుడిగా కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఉన్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం బెయిల్ ఫై బయట ఉన్న అవినాష్ బెయిల్‌ను రద్దు చేయాలని అప్రూవర్‌ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ఫై తెలంగాణ హైకోర్టు లో వాదనలు నడుస్తున్నాయి. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఇరు వైపులా వాదనలు పూర్తి అవ్వడం తో కోర్ట్ తీర్పు ఇచ్చింది. అవినాష్ బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

ఇదిలా ఉంటె ప్రస్తుతం అవినాష్ రెడ్డి మరోసారి కడప ఎంపీ బరిలో పోటీ చేస్తుండగా..ఈయనపై కాంగ్రెస్ నుండి వైస్ షర్మిల బరిలోకి దిగుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారా అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షర్మిల తన ప్రచారంలో ఎక్కువగా వివేకా హత్య గురించి..అవినాష్ గురించే మాట్లాడుతూ వస్తుంది. అవినాష్ రెడ్డి నే ఈ హత్య చేయించాడని గట్టిగా చెపుతూ వస్తుంది. మరి ప్రజలు ఎవరికీ ఓటు వేస్తారనేది చూడాలి.

Read Also : AP Politics : వైసీపీకి సంక్షోభం తప్పదా..?