Site icon HashtagU Telugu

BIG BREAKING: దసరా పండుగకు సింగరేణి కార్మికులకు భారీ బోనస్

CM Revanth

CM Revanth

హైదరాబాద్: (Bonus for Singereni Workers) సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగకు ముందే శుభవార్తను అందించింది. ఒక్కో కార్మికుడికి రూ. 1,95,610 బోనస్ ప్రకటిస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.

మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ..

“సింగరేణి తెలంగాణకు ఆత్మలాంటిది. ఇది ఉద్యోగ గని మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ backbone కూడా. కార్మికుల సంక్షేమమే మా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం,” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే:

ప్రతి రెగ్యులర్ ఉద్యోగికి దసరా బోనస్: Rs.1,95,610

కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేకంగా: Rs.5,500

సింగరేణి సంస్థ లాభాల్లో వాటా: రూ. 2,360 కోట్ల లాభాల్లో 34% కార్మికులకు పంచేందుకు నిర్ణయం

ప్రతి ఉద్యోగి సంక్షేమం కోసం సగటున: రూ. 5 లక్షల వరకు వ్యయం

దీపావళికి కూడా లాభాల్లో వాటా అందించనున్న ప్రభుత్వం

ఈ బోనస్ ప్రకటనతో సింగరేణి ఉద్యోగుల మధ్య ఆనందం వెల్లివిరిచింది. కార్మికుల సంక్షేమానికి అనేక విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, ఈ నిర్ణయంతో మరోసారి తమ మద్దతు చాటిందని కార్మిక సంఘాలు స్పందించాయి.

Exit mobile version