TGPSC : గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయం

గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్‌సీ కీలక ప్రకటన చేసింది.

  • Written By:
  • Updated On - July 4, 2024 / 03:46 PM IST

TGPSC : గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్‌సీ కీలక ప్రకటన చేసింది. మెయిన్స్ పరీక్ష కోసం అభ్యర్థులను 1:50 నిష్ఫత్తి ప్రకారమే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ విభాగం జారీ చేసిన జీవో నెంబర్‌ 29, 55 ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని టీజీపీఎస్‌సీ(TGPSC) తేల్చి చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join

గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీజీపీఎస్‌సీకి ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు నిరుద్యోగులు ఇంకో రకమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.  1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు. ఈ తరుణంలో స్పందించిన టీజీపీఎస్‌సీ  1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యమయ్యే విషయం కాదని తేల్చి చెప్పింది. ఈమేరకు ఒక మెమోను జారీ చేసింది. జీఏడీ జారీ చేసిన జీవోల ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్‌సీ  వెల్లడించింది.

Also Read :Anant Ambani Wedding : అంబానీ ఇంట్లో గ్రాండ్‌గా ‘మామెరు’ వేడుక

563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ను టీజీపీ‌ఎస్‌సీ ఫిబ్రవరి 19న విడుదల చేసింది. జూన్‌ 9న ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు.త్వరలోనే రిజల్ట్స్‌ను రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ ఎగ్జామ్స్ జరుగుతాయి. మెయిన్స్ పరీక్షలో 7 పేపర్లు ఉంటాయి. ఇంగ్లిష్‌ క్వాలిఫయింగ్‌ పేపర్‌‌గా ఉంటుంది. దీని మార్కులను మెయిన్స్‌ పరీక్ష మొత్తం మార్కుల్లో కలపరు. ప్రతీ పేపరును 150 మార్కులు ఉంటాయి.  అక్టోబరు 21న జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ పేపర్), అక్టోబరు 22న పేపర్-I (జనరల్ ఎస్సే), అక్టోబరు 23న పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం),  అక్టోబరు 24న పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్), అక్టోబరు 25న పేపర్ -IV (ఎకానమీ, డెవలప్‌మెంట్), అక్టోబరు 26న పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇంటర్‌ప్రిటేషన్ ), అక్టోబరు 27న పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) పరీక్ష జరుగుతాయి.

Also Read :PMLA Case : ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి లాక‌ర్ నుంచి 1.2 కేజీల గోల్డ్ స్వాధీనం