Telangana : భట్టికి తప్పని కరెంట్ కష్టాలు..అసలు ఏంజరిగిందంటే..!!

సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 11:09 PM IST

కాంగ్రెస్ (Congress) వచ్చింది…కరెంట్ (Current) కష్టాలు మొదలయ్యాయి అంటూ ఓ పక్క బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..రాష్ట్రంలో క్షణం కూడా కరెంట్ పోవడం లేదని..కావాలనే ప్రభుత్వం ఫై ఈ బిఆర్ఎస్ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ఖండిస్తూ వస్తుంది. కానీ వాస్తవానికి రాష్ట్రంలో బిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు అంత పెద్దగా కరెంట్ కష్టాలు లేవు కానీ అప్పుడప్పుడు కరెంట్ పోతూ వస్తుంది. దీనికి కారణం అధిక కరెంట్ వాడడంతో ట్రాన్సఫార్మర్ల ఫై లోడ్ ఎక్కువ పడి ఫీజులు కొట్టేయడం..వంటివి జరుగుతూ కరెంట్ పోతుంది..అంతే తప్ప మరోటి కాదు..ఇప్పుడే ఇదే కారణంగా భట్టి (Bhatti Vikramarka) కూడా చీకట్లో ఉండాల్సి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. వీరు సమావేశమైన కాసేపటికే కరెంట్ పోయింది. కాసేపటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంట్ వచ్చినప్పటికీ… సీపీఐ కార్యాలయంలో మాత్రం రాలేదు. దీంతో భట్టివిక్రమార్క సహా సీపీఐ నేతలు దాదాపు 30 నిమిషాల పాటు చీకట్లో గడపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోస్ ఫై బిఆర్ఎస్ మరో విధంగా ఆరోపణలు చేస్తూ తెగ షేర్ చేస్తుంది.

Read Also : Sabari: రిస్క్ తీసుకుంటే జీవితంలో పైకి వస్తానని నమ్ముతా: శబరి నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల