Telangana Congress: తెలంగాణ పోలీస్ వ్యవస్థ అధికారానికి తొత్తుగా మారింది: భట్టి విక్రమార్క

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలు పెట్టారు.

Telangana Congress: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కాలినడకన ప్రజల చెంతకు వెళ్లి తమ కష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ రోజు గురువారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం నక్కలగండి ప్రాజెక్టు పాదయాత్ర శిబిరం వద్ద ఈ లేఖను విడుదల చేశారు

బట్టి లేఖలోని సారాంశం ఏంటంటే.. ప్రజలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తన పాదయాత్రలో భాగంగా వందలాది మంది ప్రజలకు తనకు విన్నవించినట్టు బట్టి విక్రమార్క ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ కి లేఖ ద్వారా వివరించారు. క్షేత్రస్థాయి పోలీసుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉందని గ్రహించి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశానన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ఆదేశాలను అమలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీకి ప్రైవేటు సైన్యంగా మారిందని విమర్శించారు. .

డిజిపి, ఐజి, డిఐజి, ఎస్పీ లాంటి అధికారులతో పోలీస్ అధికారులు డీ లింకు అయ్యి ఉన్నతాధికారులు చెప్పినట్టుగా కాకుండా అధికార పార్టీ స్థానిక శాసనసభ్యులు ఆదేశాలను పాటిస్తున్నారని అన్నారు. తెలంగాణ పోలీసులు అధికార పార్టీకి ప్రయివేటు సైన్యంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సందర్భంగా వారు తమ మాట్లాడే స్వేచ్చని కోల్పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో ప్రస్తుతం ప్రశ్నించే గొంతుకలు, కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల వాదులు, రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా భావజాలాన్ని వ్యాప్తి చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం ఉపయోగించాలి తప్ప రాజకీయ పార్టీల కోసం కాదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి పోలీసు వ్యవస్థను ప్రజల కోసమే ఉపయోగించాలని సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Read More: Adipurush : ‘ఆదిపురుష్’కి క్లీన్ U సెన్సార్ సర్టిఫికెట్.. వామ్మో రన్ టైం మరీ అంతా?