Budget : రేపు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టన్ను భట్టి విక్రమార్క

ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశ పెట్టింది.

  • Written By:
  • Publish Date - July 24, 2024 / 08:42 PM IST

Deputy CM Mallu Bhatti Wickremarka: రేపు(గురువారం) డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమర్క అసెంబ్లీ(Assembly)లో తెలంగాణ బడ్జెట్‌(Telangana Budget) 2024-25ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశ పెట్టింది. రూ. 2,01,178 కోట్ల రెవిన్యూ వ్యయం, రూ. 29,669 కోట్ల మూలధన వ్యయంగా బడ్జెట్ ను ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్టుగా అప్పట్లోనే ప్రభుత్వం తెలిపింది. రేపు పూర్తిస్థాయి బడ్జెట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టనుంది.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం 27న బడ్జెట్‌ పై సాధారణ చర్చ చేపట్టి..అదేరోజు సమాధానం ఇవ్వనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో పద్దులపై చర్చ, ఆమోదం ఉంటాయి. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చించి ఆమోదిస్తారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మరుసటి రోజు.. 26న సభకు విరామం ఇవ్వనున్నారు. అలాగే హైదరాబాద్‌ బోనాల పండుగను దృష్టిలో పెట్టుకుని 28న కూడా విరామం ఇస్తున్నారు. మంగళవారం మొదలుకుని 31 వరకు మొత్తం ఏడు పనిదినాలు ఖరారయ్యాయి. కాగా, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన మంగళవారం అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో సమావేశమైన శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Read Also: Raja Saab : రాజా సాబ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పక్కానా..?

 

 

 

 

Follow us