Site icon HashtagU Telugu

Bhatti Vikramarka- Uttam Kumar: సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్..!

Ministers

Compressjpeg.online 1280x720 Image 11zon

Bhatti Vikramarka- Uttam Kumar: తెలంగాణలో సీపీఐతో కలిసి కాంగ్రెస్ 65 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం ఎంపికలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. సీఎంను ఎంపిక చేసే బాధ్యత అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు సోమవారం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై ప్రకటన వచ్చే తరుణంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ (Bhatti Vikramarka- Uttam Kumar) ఢిల్లీ వెళ్లారు. సీఎం పదవికి తమ పేర్లను కూడా పరిశీలించాలని అధిష్టానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు మధ్యాహ్నం భట్టి విక్రమార్క ,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖర్గేను కలవనున్నారు. ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో డీకే శివకుమార్‌ భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఏఐసీసీ పరిశీలకులు చర్చించనున్నారు. ఖర్గేతో భేటీ తర్వాతే తెలంగాణ సీఎం ఎవరనేది తెలుస్తుందని సమాచారం.

Also Read: Singareni Elections : సింగరేణి ఎన్నికలకు అంతా రెడీ.. ఎప్పుడు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 65 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్‌ పార్టీ 39 స్థానాలకు పరిమితం అయింది. బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.