జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఊగిపోతున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న తనకు కనీసం ఈ విషయం తెలియజేయరా…నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ను ఎలా చేర్చుకుంటారని ఫైర్ అవుతూ..పార్టీ మారేందుకు కూడా సిద్ధం అయ్యాడు. మొన్న రాత్రి నుండి జీవన్ రెడ్డి మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. జీవన్ రెడ్డిని కలిసి జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి..బిజెపి లో చేరాలని కూడా జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ పెద్దలు జీవన్ రెడ్డి ని బుజ్జగించే పనిలో పడ్డారు. రాత్రి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడగా..ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి..స్వయంగా బేగం పేట లోని జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
సమావేశం అనంతరం భట్టి మీడియా తో మాట్లాడుతూ..జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు మా అందరికి మార్గదర్శకులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పది సంవత్సరాలు కాంగ్రెస్ జెండాను భుజాన మోశారు. పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని భట్టి తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యమిస్తూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.
Read Also : Woman Suicide Attempt : పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం