Site icon HashtagU Telugu

Bhatti Vikramarka : బీఆర్ఎస్ పాలనలో ఎంపీకే రక్షణ లేకుండా అయిపోయింది -భట్టి విక్రమార్క

Bhatti Prabha

Bhatti Prabha

సోమవారం దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (kotta prabhakar) ఫై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఫై ఓ వ్యక్తి తో కత్తి తో దాడి చేయడంతో..ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ దాడి చేసింది కాంగ్రెస్ (Congress) కార్య కర్తే అని బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..మా కార్యకర్త కాదని , కావాలనే తమపై బిఆర్ఎస్ బురద చెల్లుతుందని కాంగ్రెస్ మండిపడుతుంది. ఈ క్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈ ఘటన ఫై స్పందిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు.

We’re now on WhatsApp. Click to Join.

పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనల్లో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం దాడి ఎందుకు చేశాడని విచారణ చేసి నిజా నిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి విపక్షాలపై దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులను మీ దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా బంద్ కాల్ ఇస్తామని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉంది అని భట్టి విక్రమార్క అన్నారు. బంద్ కాల్ పిలుపు ఎవరిపైన ఇస్తున్నారు? బంద్ దేని కోసం? మీ పాలనపైన మీరే ఇచ్చుకుంటారా? బంద్ పేరుతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

Read Also : Chandrababu : చంద్రబాబుకి బెయిల్ రావడంపై పవన్ కళ్యాణ్ సంతోషం