తెలంగాణ సర్కార్ (Telangana Govt) తీసుకొచ్చిన హైడ్రా (Hydraa) వ్యవస్థపై జరుగుతున్న ప్రచారం ఫై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలు , చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో రేవంత్ సర్కార్ ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైడ్రా రావడం రావడమే..సినీ నటుడు నాగార్జున కు సంబదించిన N కన్వెన్షన్ కూల్చడం తో సామాన్య ప్రజల్లోనూ హైడ్రా ఫై నమ్మకం ఏర్పడింది. హైడ్రా ముందు రాజకీయ నేతలు , బిజినెస్ , సినీ ప్రముఖులు ఇలా అంత సమానమే అనే భావన ప్రజల్లో నెలకొంది.
ఇది ముందు…ఆ తర్వాత హైడ్రా తీరు మారింది. బడాబాబులు , రాజకీయ నేతలను వదిలిపెట్టి సామాన్య ప్రజల ఇళ్లపై బుల్లడోజర్స్ పంపడం మొదలుపెట్టడం తో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎక్కడిక్కడే ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతూ రోడ్ల పైకి వస్తున్నారు. విపక్షాలు సైతం బాధితులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం ఫై ధ్వజమెత్తుతున్నారు. ఇలా రోజు రోజుకు కాంగ్రెస్ సర్కార్ ఫై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం తో..భట్టి (Bhatti Vikramarka) హైడ్రా ఫై స్పందించారు. హైడ్రా కూల్చివేతలపై.. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని.. ఇప్పటి వరకు FTLలో కట్టుకున్న ఇండ్లను మాత్రమే కూల్చేస్తున్నామని.. బఫర్ జోన్‌లో ఉన్నవాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
Read Also : Iran Spy : హిజ్బుల్లా చీఫ్‌ను ఎలా చంపారు ? హసన్ నస్రల్లా ఆచూకీ చెప్పింది అతడే ?