Site icon HashtagU Telugu

T Congress : డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క..?

Bhatti Sithakka

Bhatti Sithakka

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ..మరికాసేపట్లో సీఎం (CM) ఎవరో ప్రకటించనుంది. హైదరాబాద్ లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సీఎం అభ్యర్థి పేరును కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించనున్నారు.

కాంగ్రెస్ నుండి గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు మీట్ అయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎంలుగా మల్లు భట్టి విక్రమార్క, సీతక్క (Bhatti Vikramarka Sitakka )లను నిర్ణయించినట్లు తెలుస్తుంది. వీరి పేర్లనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. రాత్రి 8.30 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఎస్సీ వర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎస్టీ నుంచి సీతక్క డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం అందుతుంది. ఇందుకోసం దర్బార్ హాల్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

డిప్యూటీ సీఎంగా సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ సహా మరికొన్ని బాధ్యతలు దక్కనున్నాయి. మల్లు భట్టి విక్రమార్కకు ఫైనాన్స్, పౌర సరఫరాల శాఖలు కేటాయించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నా ప్రమాణ స్వీకారం తర్వాత పోర్టుఫోలియోలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనున్నది. మైనారిటీ కమ్యూనిటీ నుంచి షబ్బీర్ ఆలీకి అవకాశాలుండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన కేబినెట్ మంత్రులను ఖరారు చేయడంపై నాలుగైదు రోజుల్లో కసరత్తు పూర్తి కానున్నదని సమాచారం.

Read Also : Telangana: బీఆర్ఎస్ ఓటమి ఎఫెక్ట్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా!