Site icon HashtagU Telugu

TG Assembly : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు ఎంతంటే..!!

Bhatti Vikramarka (2)

Bhatti Vikramarka (2)

2024 -25 కు గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ (Telangana Assembly Budget Session 2024) ను గురువారం అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశ పెట్టగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీఠం వేయడం తో పాటు కాంగ్రెస్ తీసుకొచ్చిన హామీలకు భారీగా నిధులు కేటాయించారు. అలాగే గడిచిన పదేళ్లలో బిఆర్ఎస్ (BRS) చేసిన అప్పులు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేక చేసిన అప్పులు , అమలు చేసిన పథకాలు , వాటికీ అయినా ఖర్చులు తదితర విషయాలను క్లుప్తంగా భట్టి వివరించే ప్రయత్నం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయానికి రూ.75,577 కోట్ల అప్పు 2023 డిసెంబరు నాటికి రూ.6,71,757 కోట్లుకు చేరిందని విక్రమార్క తెలిపారు. అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు పది రెట్లు పెరిగిందని చెప్పుకొచ్చారు. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయం రూ.1,83,236. దీంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,64,063 ఎక్కువగా ఉందన్నారు. అదే సమయంలో తలసరి ఆదాయం స్థాయిల్లో జిల్లాల మధ్య వ్యత్యాసం తీవ్రంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862 కాగా, వికారాబాద్​ జిల్లా తలసరి ఆదాయం రూ.1,80,241. దీంతో రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలను తగ్గించడానికి తమ ప్రభుత్వం పలు విధానాలను రూపొందించి అమలు చేస్తోందని స్పష్టం చేసారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు, వడ్డీలతో కలిపి రూ.42,892 కోట్ల బకాయిలను చెల్లించినట్లు సమావేశంలో తెలిపారు. ఇప్పటివరకు రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశామని, ఈ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా, బియ్యంపై సబ్సిడీ, ఉన్నాయని డిప్యూటీ సీఎం సభకు వివరించారు.

ఇదే సందర్బంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై కూడా నిప్పులు చెరిగారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తాం. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేసారు.

Read Also : Telangana Budget 2024 – 25 : క్లారిటీ లేని బడ్జెట్ – కేసీఆర్ ఎద్దేవా