Peoples March : ట్విట్ట‌ర్ ట్రెండింగ్‌లో పీపుల్స్ మార్చ్

సీఎల్పీ భట్టి నేత పేరు ట్విట్టర్ లో ఇండియా లెవల్ లో ట్రెండింగ్ అవుతోంది. భట్టి విక్రమార్క్ ప్రారంభించిన పీపుల్స్ మార్చ్

Published By: HashtagU Telugu Desk
Bhatti Vikramarka

Bhatti Vikramarka

సీఎల్పీ భట్టి నేత పేరు ట్విట్టర్ లో ఇండియా లెవల్ లో ట్రెండింగ్ అవుతోంది. భట్టి విక్రమార్క్ ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ నిన్నిటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ పీపుల్స్ మార్చ్ బీఆర్ఎస్ ను గద్దె దింపే మార్చ్ గా మారింది.పీపుల్స్ మార్చ్‌తో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. మండుటెండల్లో పేదల మధ్యే భట్టి గ్రామా గ్రామన తన యాత్ర సాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం అండ, ఆశీస్సులతో ఒక్కో అడుగుతో బీఆర్ఎస్ లో టెన్షన్ పెంచారు. పార్టీ నేతలను ఏకం చేసారు. ఇతర పార్టీల నేతలు కదలి కాంగ్రెస్ లో కలిసేలా చేసారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ లో నయా ట్రెండ్ సెట్టెర్ గా భట్టిని నిలిపింది. కర్ణాటక తరువాత తెలంగాణ పైన ఆశలు పెట్టుకున్న వేళ పార్టీలో జోష్ పెంచింది. వంద రోజులు ప్రతీ రోజు ప్రజల మధ్యనే ఉంటూ సాగిన భట్టిపై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురుస్తున్నాయి. భట్టికి అనుకూల స్లోగన్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. కాంగ్రెస్ లో భట్టి పేరుతో సాగుతున్న సెలబ్రేషన్స్ బీఆర్ఎస్, బీజేపీల్లో వైబ్రేషన్స్ కు కారణమయ్యాయి. తెలంగాణ గడ్డలో ప్రతీ ప్రాంతం నుంచి భట్టికి మద్దతుగా నిలుస్తున్నారు.

Twitter Bhatti Vikramarka

  Last Updated: 24 Jun 2023, 07:10 PM IST