Bhatti Meet Finance Minister: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Meet Finance Minister) విక్రమార్క మల్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను సఫ్దర్ జంగ్ రోడ్డులోని ఆమె అధికారిక నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం ఆమెకు అందజేశారు.
Also Read: Magh Purnima 2025: కుంభమేళాలో స్నానం చేయడానికి మరో మంచి రోజు!
నిర్మల సీతారామన్‌ను భట్టి కోరిన నిధులివే
- వివిధ కార్పొరేషన్‌లు/ SPVల రుణ పునర్వ్యవస్థీకరణ- ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
- తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 4,08,48,54,461 తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు.
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద, విభాగం 94(2) ప్రకారం తెలంగాణకు రావాల్సిన వెనుకబాటుగా ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కోరారు.
- 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
- ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాధ్యత మేరకు అందుకోవాల్సిన మొత్తానికి సంబంధించిన అంశంపైన చర్చించారు.
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద నిధుల బదిలీ కోరుతూ విజ్ఞప్తి చేశారు.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, తదితరులు ఉన్నారు.