Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra: తెలంగాణలో ముగిసిన భారత్ జోడో యాత్ర

Rahul Imresizer (1)

Rahul Imresizer (1)

తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ గాంధీ ముగింపు సభ నిర్వహించారు.

ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో చాలా మందితో మాట్లాడానని, రాష్ట్ర ప్రజలను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశిస్తుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లడం బాధాకరం – రాహుల్

తెలంగాణలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ఇది రేపటి నుంచి మహారాష్ట్రలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ యాత్ర వీడ్కోలు సభ జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రం విడిచి వెళ్లడం బాధాకరమని… రాష్ట్రంలో కార్మికులు అద్భుతంగా పనిచేస్తున్నారని రాహుల్ వెల్లడించారు. మీడియాలో చూపించినా చూపకున్నా కళ్లారా చూస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో తనను కలిసిన ఒక్క రైతు కూడా సంతోషంగా లేడన్నారు. తెలంగాణ వాణిని ఒక చోట అణిచివేస్తే మరో ప్రాంతం నుంచి వినిపిస్తుందని, దానిని ఎవరూ అణచలేరన్నారు. ఇక్కడ చేసిన పాదయాత్రను ఎప్పటికీ మరిచిపోలేనని రాహుల్ అన్నారు.

Exit mobile version