Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra: రాహుల్ జోడో యాత్రకు బ్రహ్మరథం.. చివరిరోజు జన సందోహం!

Rahul1

Rahul1

తెలంగాణలో భారత్ జోడో యాత్ర చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల కలుపుకొనిపోతూ నడిచారు. జుక్కల్‌లో ఆదివారం రాత్రి విరామం తర్వాత పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. మధ్యాహ్న విరామం కోసం షేఖాపూర్‌లో యాత్ర నిలిచిపోయింది. పార్టీ రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సాయంత్రం కొనసాగుతున్న యాత్రలో భాగంగా తెలంగాణలో చివరిదైన మేనూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సోమవారం రాత్రి మిరాజ్‌పూర్ హనుమాన్ మందిర్ నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించి పొరుగున ఉన్న మహారాష్ట్రలో అడుగుపెట్టనున్నారు.

డెగ్లూర్‌లోని కళామందిర్‌లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) నాయకులు రాహుల్ గాంధీకి స్వాగతం పలకనున్నారు. ప్రజలను ఏకం చేయడానికి, “బిజెపి, ఆరెస్సెస్ కు వ్యతిరేకంగా నిలబడటానికి” రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7 న కన్యాకుమారి నుండి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లను కవర్ చేసింది. ఇది అక్టోబరు 23న కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలోని 19 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 375 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.

Exit mobile version