Vinayaka Chavithi : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమావేశం.. హైదరాబాద్‌లో వినాయకచవితి, నిమజ్జనం ఎప్పుడంటే..

తాజాగా నేడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమావేశం నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Vinayaka Chavithi 2024

Vinayaka Chavithi 2024

మరి కొన్ని రోజుల్లో వినాయకచవితి(Vinayaka Chavithi) పండుగ రానుంది. ఇప్పటికే చాలా చోట్ల వినాయక విగ్రహాలను రెడీ చేస్తున్నారు. వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. మన దేశంలో ముంబై(Mumbai) తర్వాత హైదరాబాద్(Hyderabad) లోనే ఘనంగా వినాయక చవితి నిర్వహిస్తారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి(Bhagyanagar Ganesh Utsava Samithi) పేరిట హైదరాబాద్ వినాయకచవితి సంబరాలకు ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా నేడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తలసాని, హైదరాబాద్ నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, పలు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సికింద్రాబాద్ YMCA గణేష్ ఉత్సవ సమితిలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశంలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

నగరంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించే అంశంపై చర్చలు జరిపారు. అలాగే ఉత్సవ కమిటీల అభిప్రాయాలతో పాటు సలహాలు కూడా ప్రభుత్వం స్వీకరించింది. పోలీసులు, ఉన్నతాధికారులు గణేష్ ఉత్సవ సమితిలకు జాగ్రత్తలు, రూల్స్ జారీచేశారు.

ఈ సారి వినాయక చవితి పండుగ ఏ తేదీ అని చాలా మందిలో సందేహం ఉంది. దీనిపై కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలతో, పూజారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 18న మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంది. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండగ రోజుగ గుర్తిస్తాం. కాబట్టి 19వ తేదీనే హైదరాబాద్ లో వినాయక చవితి జరపనున్నట్టు తెలిపారు. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని పేర్కొన్నారు.

 

Also Read : Kashi Yatra: ఐఆర్‌‌సీటీసీ కొత్త ప్యాకేజీ.. కాశీ యాత్ర సాగుతుందిలా!

  Last Updated: 28 Aug 2023, 08:38 PM IST