Site icon HashtagU Telugu

Bhadrachalam: భద్రాచలం.. జలదిగ్భందం!

Badrachalam

Badrachalam

భారీ వర్షాల కారణంగానది పరివాహాక ప్రాంతాలు నీటి మునిగిపోతున్నాయి. జనావాసాల్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద తాకిడి ఎక్కువ కావడంతో పడవల్లో ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుండడంతో భద్రాచలం జలవిళయంతో విలవిలలాడుతోంది. గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 67 అడుగులకు చేరిందని, 75 అడుగులకు చేరితే మరింత ప్రమాదకరమని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రస్తుత పరిస్థితి 1986 నాటి వరదలను గుర్తుకు తెస్తోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. భద్రాచలానికి లక్షా 29 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని చెప్పారు. భారీ వరదల కారణంగా వంతెన కూడా మూసుకుపోయింది. 1986 ఆగస్టు 16న భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం అత్యధికంగా 75.6 అడుగులకు చేరుకుని పట్టణాన్ని నాశనం చేసిందని చెప్పారు. 1990లో, నది నీటి మట్టం రెండవ అత్యధిక స్థాయి 70.8 అడుగులకు చేరుకుంది.

70 అడుగులకు చేరిన గోదారి నీటిమట్టం

గోదావరిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్నడూ లేనివిధంగా భద్రాచలం వద్ద నీటిమట్టం 70 అడుగులకు చేరుకుంది. వరద తీవ్రతను గుర్తించిన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం వంతెనపై నుంచి రాకపోకలను నిషేధించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.