Munugode Bypoll: మునుగోడు ఫలితంపై కోట్లలో కాయ్ రాజా కాయ్..!

బెట్టింగ్ కు కాదేదీ అనర్హం అంటున్నారు బూకీలు.

  • Written By:
  • Updated On - November 5, 2022 / 12:43 PM IST

బెట్టింగ్ కు కాదేదీ అనర్హం అంటున్నారు బూకీలు. క్రికెట్, కబడ్డి ఆటలే కాదు ఇంకేదైనా సరే అంటూ మునుగోడు ఉప ఎన్నికను సైతం అందుకు వేదికచేశారు. కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లను ఆకర్షిస్తున్నారు. పార్టీల గెలుపు..ఓటమి, మెజార్టీ, డిపాజిట్, రౌండ్.. రౌండ్ కు ఫలితాలపై బెట్టింగ్ కు సిద్దమయ్యారు. ఈ ఒక్క ఉప ఎన్నికపై100కోట్ల బెట్టింగ్ సాగినా ఆశ్చర్యం లేదంటున్నారు అనుభవజ్ఞులు.

మునుగోడు ఎన్నికలు ముగిసి గెలుపు ఓటములపై ఆయా పార్టీల నేతలు ఎగ్జిట్ పోల్స్ ను అంచనా వేస్తు ఆనందించే వారు కొందరైతే.. బాధతో భారంగా నిట్టూరుస్తున్నారు మరికొందరు. ఇక అభ్యర్ధులు అయితే టెన్షన్ తో తలలు బాదుకొంటున్నారు. గెలుపు, ఓటమి కొందరిది. మరికొందరిది డిపాజిట్ వస్తుందా.. 47మందిలో మన స్థానం ఎంత. ఎన్ని ఓట్లు వస్తాయి. ఒక్కొక్కరిది ఒక్కో టెన్షన్. ఇక అంతకంటే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరికొందరు. వరే బెట్టింగ్ రాయుళ్లు. వీరికి ఏపార్టీ గెలిసిన ఒకటే గాని పైసల్ ముఖ్యం నీను బెట్టింగ్ పెట్టిన పార్టే గెలవాలని మొక్కని దేవుడు లేడు. ఎక్కని మెట్లు లేవు అంటే నమ్మండి. ఒకటికి రెండితలు అనే సరికి లక్షల్లో బెట్టింగ్ కాసి కూర్చున్నారు. కౌంటింగ్ కు సమయం సమీపిస్తున్న కొద్ది వీరిలో టెన్షన్ పెరుగుతుంది.

Also Read:  Munugode Counting: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్, 21 టేబుల్స్.. 15 రౌండ్లు!

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. పలుర్టీల గెలుపు, ఓటమిలపై భారీ బెట్టింగ్ సాగుతుంది. ఈనెల ఆరున మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉండటంతో రంగం లోకి దిగింది బెట్టింగ్ మాఫియా. ముంబాయి,డిల్లీ బూకీలు హైదరాబాద్ లో తిష్టవేసి ఫంటర్స్ ను పట్టే పనిలో పడ్డారు. ఒకటికి రెండింతలు అంటూ కోట్లలో బెట్టింగ్ కాస్తున్నారు. ఒక్కరోజే 100 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. హైదరాబాద్ హోటల్స్ తిష్టవేసిన బూకీ లు మద్యవర్తులుగా ఏజంట్స్ ను ఏర్పాటు చేసుకొని అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు.

ఐపిఎల్ తరహాలో లో ఎన్నికల బెట్టింగ్ కు దిగుతున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపు, మెజార్టీ లపై అధికంగా బెట్టింగ్ సాగుతుంది. రౌండ్ రౌండ్ ఫలితాలపై సైతం బెట్టింగ్ కు సిద్దమవుతున్న బూకీలు. డిపాజిట్ సాదించేదెవరు? కోల్పోయేదెవరు అనే అశం పై సైతం బెట్టింగ్ నడుస్తుంది. బెట్టింగ్ పై పోలీసులు నిఘా పెంచారు. టాస్క్ఫోర్స్, ఎస్వోటీ టీమ్స్ ను అధికారులు రంగంలోకి దింపారు.

Also Read:  Telangana TDP: తెలంగాణ టీడీపీకి కొత్త బాస్.. అధ్యక్షుడిగా కాసాని నియామకం!