Bethavolu Canal : ఊడిన బేతవోలు కాలువ షట్టర్‌..చేతికందిన పంట నీట మునిగే

కోతకు వచ్చిన పొలాలు..కోత కోసిన పంట కల్లాల్లోనే ఉన్న ధాన్యం ఇలా అంత కూడా తడిసిముద్దయ్యాయి

Published By: HashtagU Telugu Desk
bethavolu canal shutter blown

bethavolu canal shutter blown

ఆరు నెలలుగా కష్టపడినా కష్టం నీటిపాలైంది..కోతలు కొద్దాం అనుకున్న రైతులకు కన్నీరు మిగిలింది. ఆదివారం రాత్రి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్‌పై నిర్మించిన బేతవోలు వరద కాలువ (Bethavolu Canal)కు ఉన్న ఎస్కేప్ షట్టర్ ఊడిపోవడం (Bethavolu Canal Shutter Blown) తో దానికి కింద ఉన్న వందల ఎకరాలు (Crops Damaged) నీటమునిగాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో చోటుచేసుకుంది. కోతకు వచ్చిన పొలాలు..కోత కోసిన పంట కల్లాల్లోనే ఉన్న ధాన్యం ఇలా అంత కూడా తడిసిముద్దయ్యాయి. తడిసినపొలాలు , ధాన్యం చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటూ..ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఘటన సమాచారం నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్ సీఈ రమేష్‌ బాబు, ఎస్‌ ఈ నరసింహరాజు కాలువను పరిశీలించి, నీటి సరఫరాను నిలిపివేశారు. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటమునగడంతో రైతులు ఆవేదన వక్యం చేశారు. తమక న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బేతవోలు చెరువు నింపేందుకు జేసీబీతో షట్టర్‌ తెరిచినట్లు పోలేనిగూడెం రైతులు ఆరోపిస్తున్నారు. అది కావాలనే చేశారని.. షెట్టర్ తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also : Lawyers Vs ChatGPT : లాయర్లకు ‘ఛాట్‌ జీపీటీ’ ఝలక్.. నమ్ముకుంటే నట్టేట ముంచుతోందట !

  Last Updated: 20 Nov 2023, 01:30 PM IST