Best Tourist Places In Telangana : తెలంగాణలో ఈ ప్రదేశాలకు వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 01:14 PM IST

ప్రస్తుతం మనిషి జీవన విధానం ఎంత బిజీ గా మారిందో చెప్పాల్సిన పనిలేదు. లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు ఉరుకులపరుగుల జీవితంగా మారింది. డబ్బుతో పరుగెత్తే రోజులు వచ్చాయి. ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపే వారు కూడా చాల తక్కువ అయిపోయారు. ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ..పిల్లలతో గడపడం కూడా మానేశారు. వారికీ ఏంకావాలన్న ఇంట్లో పనోళ్లే చూసుకుంటున్నారు. దీంతో చిన్ని చిన్న సంతోషాలకు కూడా దూరం అవుతున్నారు. అందుకే మీ బిజీ లైఫ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు ఎంతో దూరం వెళ్లకుండా మన తెలంగాణ లో మనకు నచ్చే ప్రదేశాలను మీకు తెలియజేస్తున్నాము.

ప్రస్తుతం సమ్మర్ వచ్చేసింది..పిల్లలకు కూడా పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షలు అవ్వగానే ఎంచక్కా వారిని తీసుకొని తెలంగాణ (Telangana ) లో బెస్ట్ ప్రదేశాలకు (Best Tourist Places) వెళ్లి ఎంజాయ్ చెయ్యండి. ఆ బెస్ట్ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* వరంగల్

* కరీంనగర్

* నిజామాబాద్

* మెదక్

* ఖమ్మం

* నల్గొండ

* మహబూబ్ నగర్

* రంగారెడ్డి

* ఆదిలాబాద్ :

* హైదరాబాద్ వంటి జిల్లాలో ఎన్నో అద్భుతమైనవి చూడొచ్చు.

ముందుగా హైదరాబాద్ విషయానికి వస్తే..హైదరాబాద్ లో ఎన్నో చూడొచ్చు. చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ , హుస్సేన్ సాగర్, గోల్కొండ, సాలార్​జంగ్​ మ్యూజియం, బిర్లా మందిర్, చౌమహల్ల, ఫలక్​నుమా ప్యాలెస్​లు, కుతుబ్ షాహీ సమాధులు, నెహ్రూ జూ పార్కు, జలవిహార్, వండర్ లా, ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ ఐమ్యాక్స్, లుంబినీ పార్కు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వాటిని అన్నింటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మహబూబ్​నగర్ :

ఈ పేరు వినగానే అందరికి పిల్లలమర్రి గుర్తొస్తుంది. జూరాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠం జోగులాంబ గద్వాల, మల్లెల తీర్థం జలపాతం, గద్వాల కోట ఇలా అనేకమైనవి ఈ జిల్లాలో చూడొచ్చు.

రంగారెడ్డి :

ఈ జిల్లాలో అనంతగిరి కొండలు (Anantha Giri hills), కోట్​పల్లి జలాశయం, మౌంట్ ఒపేరా, ఓసియన్ పార్కు,. మృగవాణి జాతీయ పార్కు, సంఘీ, చిలుకూరు బాలాజీ తదితరవైనవి చూడొచ్చు.

నల్గొండ:

ఈ జిల్లాలో తెలంగాణ తిరుపతిగా పేరొందిన ప్రముఖ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, కొలనుపాక జైనుల క్షేత్రం, చందంపేట, దేవరకొండ గుహలు, పోచంపల్లి చేనేత గ్రామం, భువనగిరి కోట, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కుందా సత్యనారాయణ కళాధామం, నందికొండ గ్రామం ఇలాంటి చూసేయొచ్చు.

ఖమ్మం:

ఖమ్మం జిల్లా అనగానే ముందుగా రామయ్య ఆలయం గుర్తుకొస్తుంది. ఈ జిల్లాలో రామయ్య ఆలయం తో పాటు పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్టు, గోదావరి నదికి ఇరువైపులా ఉండే పాపికొండలు, ఖమ్మం కోట, లకారం, పలైర్ సరస్సులు తదితర అందమైనవి చూడొచ్చు.

వరంగల్ :

ఈ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాకతీయుల రాజ్య చిహ్నాలు వేయి స్తంభాల గుడి, ఖిల్లా వరంగల్, కళా తోరణం, రామప్ప, భద్రకాళి, జనగామ త్రికుటాలయాలు, లక్నవరం చెరువు , పాకాల సరస్సు, బొగత జలపాతం ఇలా ఎన్నో పిల్లలతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మెదక్ :

ఇక్కడ మెదక్ కోట, సీఎస్ఐ మెదక్ క్యాథడ్రల్ చర్చ్, ఏడుపాయల దుర్గమ్మ ఆలయం, పోచారం రిజర్వాయర్ సరస్సు, పోచారం వన్య ప్రాణుల అభయారణ్యం, సింగూరు, మానేరు జలాయాలు వంటివి చూడొచ్చు.

నిజామాబాద్ :

ఈ జిల్లాలో శ్రీరామ్ సాగర్, అశోక్ సాగర్ ప్రాజెక్టులు, బోధన్ భీముని గుట్టలు, నిజామాబాద్, సిర్నపల్లి, దోమకొండ గడీలు, డిచ్​పల్లి రామాలయం, ఆర్మూర్ సిద్ధుల గుట్ట, రఘునాథ ఆలయం, బడా పహాడ్ దర్గా మొదలగున్నవి చూడొచ్చు.

కరీంనగర్ :

ఇక ఈ జిల్లాలో సిరిసిల్ల చేనేత కళా వైభవం, ఎలగందుల, జగిత్యాల, నగునూర్, మొలంగూర్, రామగిరి కోటలు కరీంనగర్ రాజసానికి ప్రతీకలు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, కాళేశ్వర ఆలయాలు, దిగువ మానేరు, రాజీవ్ గాంధీ జింకల పార్కులు మొదలగున్నవి చూడొచ్చు.

ఆదిలాబాద్ :

ఇక్కడ కుంటాల, (Kuntala Waterfalls), పొచ్చెర, మిట్టె జలపాతాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఉట్నూర్ కోట, నాగోబా ఆలయం, కవ్వాల్ అభయారణ్యం, చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయం (Basara Temple), గాంధారి ఖిల్లా, శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు గనులు.. చూడదగ్గ ప్రదేశాలు. ఇంకెందుకు ఆలస్యం వీటిలో మీకు దగ్గరలో ఉన్న వాటికీ వెళ్లి సమ్మర్ ను ఎంజాయ్ చెయ్యండి.