తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం ప్రారంభం నుంచే అనేక అరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచురులు, బంధుమిత్రులకు పథకం అందుతోందని అర్హులైన లబ్ధిదారులు బహిరంగంగానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైనప్పటికీ పథకం డబ్బులు అందలేదని కొందరు మహిళలు మంత్రికి తెలిపారు.
ప్రతి లబ్ధిదారునికి దళిత బంధు అందుతుందని ఇంద్రకరణ్ తెలిపారు. ఈ పథకం కోసం రూ. 1.5 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. వారు పదే పదే డిమాండ్ చేస్తూనే ఉండడంతో మంత్రి విసిగిపోయారు. కొంత సమయం తరువాత, మంత్రి తనను తాను నియంత్రించుకుని, పథకానికి లబ్ధిదారుల ఎంపిక మా ఇష్టం అని చెప్పారు. దళితుల బంధుపై ప్రశ్నిస్తున్న మహిళలను ఇక్కడ్నుంచి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పుడు, ఇంద్రకరణ్ మహిళలతో సంభాషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల నర్సాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కళ్యాణలక్ష్మి పథకం కింద డబ్బులు రాలేదని ఓ యువకుడు చెప్పడంతో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అతన్ని తిట్టి, సభ నుంచి తీసుకెళ్లమని పోలీసులను ఆదేశించాడు. కాగా ఇటీవలే మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. అర్హులైన దళితులకు పథకం అందడం లేదని సొంత పార్టీ నేతలే మంత్రి ఘోరావ్ చేయడం గమనార్హం.