తెలంగాణ(Telangana)లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం(Construction of New airports)పై చర్చ జరుగుతుండగా, బేగంపేట విమానాశ్రయం మళ్లీ కమర్షియల్ సేవలకు తెరచుకోనుందనే (Begumpet Airport Reopen) వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ క్రమంలోనే 2008లో మూసివేసిన బేగంపేట ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించి, డొమెస్టిక్ ఫ్లైట్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం.
MLC Elections Results : ఉత్తరాంధ్ర ఫలితం వచ్చేసింది
1930లో నిజాం కాలంలో నిర్మితమైన బేగంపేట విమానాశ్రయం, 2008 వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు కీలక కేంద్రంగా వ్యవహరించింది. కానీ శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత కమర్షియల్ విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి వీవీఐపీ విమాన ప్రయాణాలు మాత్రమే జరుగుతున్నాయి. అయితే మళ్లీ కమర్షియల్ విమానాలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండటం అనే వార్త ప్రయాణికుల్లో ఆనందం కలుగుతుంది.
Revanth Reddy : ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం: కేంద్రమంత్రితో సీఎం భేటీ
బేగంపేట ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించడం ద్వారా శంషాబాద్ విమానాశ్రయంపై భారం తగ్గించొచ్చని కేంద్ర విమానయానశాఖ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో డొమెస్టిక్ ప్రయాణికులకు ఇది తక్కువ సమయంలో అందుబాటులోకి రానుంది. అంతేకాదు బేగంపేట నుంచి విమానాలు నడిపితే శంషాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల సమయం తగ్గి ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గొచ్చని అంచనా. అయితే ఈ నిర్ణయం పై కొన్ని అవాంతరాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బేగంపేట ప్రాంతం భారీ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రధాన రహదారులపై రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, ముందు రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ ప్రయాణించే ఈ విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించే ముందు, మెరుగైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అభిప్రాయపడుతున్నారు. మరి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు సాగుతాయో వేచి చూడాలి.