Begumpet Airport: బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

జూన్ 24వ తేదీ సోమవారం బాంబు పేలుడు జరుగుతుందని గుర్తు తెలియని సర్వర్ నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం అప్రమత్తమైంది.హైదరాబాద్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది బేగంపేట విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు.

Begumpet Airport: ఇటీవల కాలంలో విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం సాధారణమైంది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను పేల్చి వేస్తామని కొందరు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరు సరదాగా చేస్తున్న ఈ చర్యకు అధికార యంత్రంగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో ప్రయాణికులు అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక తాజాగా హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది.

జూన్ 24వ తేదీ సోమవారం బాంబు పేలుడు జరుగుతుందని గుర్తు తెలియని సర్వర్ నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం అప్రమత్తమైంది.హైదరాబాద్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది బేగంపేట విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు. వారు విమానాశ్రయ భద్రతకు సంబంధించిన సెంట్రల్ ఫోర్స్ మరియు పోలీసులను సిఐఎస్‌ఎఫ్‌ను అప్రమత్తం చేశారు.హైదరాబాద్ పోలీసు బాంబు డిటెక్షన్ స్క్వాడ్ స్థానిక పోలీసులతో కలిసి విమానాశ్రయంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి మెయిల్ బూటకమని ప్రకటించింది.

గతంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి ఇదే తరహా బెదిరింపు వచ్చింది. ఫిబ్రవరిలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దాడి గురించి హెచ్చరిస్తూ వరుస ఇ-మెయిల్‌ల నేపథ్యంలో హై అలర్ట్‌లో ప్రకటించారు. 2023 ఆగస్టులో కూడా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టినట్లు ఇమెయిల్ వచ్చింది. దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణీకులకు సేవలందిస్తున్న తెలంగాణలోని ఏకైక ఆపరేషనల్ ఎయిర్‌పోర్టు అయిన ఈ విమానాశ్రయంలో భారీగా పయనిస్తారు. ఈ విమానాశ్రయం మే 18, 2024న అత్యధికంగా 82,300 మంది ప్రయాణికులతో ఒకే రోజు అత్యధికంగా ప్రయాణించింది.

Also Read: Sakshi : సాక్షికి రాబోయే కొన్నేళ్లు చాలా కఠినంగా మారనున్నాయా..?