Beer Sales in Telangana : తెలంగాణలో 18 రోజుల్లో 23 లక్షల కేసుల బీర్లు తాగేశారు

ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను తాగేశారట

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 10:35 AM IST

తెలంగాణ (Telangana ) లో ఎండలు (Summer ) ఏ రేంజ్ లో దంచి కొడుతున్నాయో తెలియంది కాదు..ఉదయం 9 దాటితే నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇంట్లో నుండి అడుగు భయటపెట్టాలనే ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 07 వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోయేసరికి ప్రజలంతా కూలర్లు , ఫ్యాన్లు , ఏసీలకు అత్తుకుపోతున్నారు. ఇక ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు బీర్లను తెగతాగేస్తూ లిక్కర్ ఖజానా నింపేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఎక్సెజ్ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను (Beer ) తాగేశారట. ఇది ఆల్టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. గతేడాది ఇదే నెల కంటే 28.7% అధికంగా బీర్ల అమ్మకాలు జరిగాయని చెప్పుకొచ్చారు. కాగా గత 15 రోజులుగా బీర్ల తయారీ తగ్గడంతో అమ్మకాలు ఇంకాస్త తగ్గాయని లేదంటే ఇంకా పెరిగి ఉండేదని అంటున్నారు. వర్ష ప్రభావం లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడిందని..డిమాండ్ తగ్గ బీర్లను అందించలేకపోతున్నామని చెపుతున్నారు. ఈ నెలలోనే ఇలా ఉంటె…వచ్చే నెలలో బీర్ల అమ్మకాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని లెక్కలు వేస్తున్నారు. మామూలుగానే తెలంగాణ లో లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి..ఇంకా ఎండాకాలం అయితే మరింతగా ఉంటాయి..కాకపోతే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బీర్ల కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.

Read Also : New Swift: భద్రత పరంగా 4 స్టార్ రేటింగ్‌.. ఈ కారు ఫీచ‌ర్స్ చూస్తే మ‌తిపోవాల్సిందే..!