Corona Cases: బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!

కరోనా మహమ్మారి పూర్తిగా అయిపోయిందనుకుంటున్న సమయంలో హఠాత్తుగా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - April 15, 2023 / 11:10 AM IST

దేశంలో చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. రోజుకురోజుకూ పెరుగుతున్నాయే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు. మళ్ళీ (Corona Cases) ఆందోళన కలిగిస్తోంది. ఒక్క రోజులోనే పది వేల కరోనా పాజిటీవ్ (Positive) కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో కేసులు వుదృతంగా పెరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం వరకు చాలా రోజులు కరోనా కేసులే నమోదు కాని పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కరోనా మహమ్మారి పూర్తిగా అయిపోయిందనుకుంటున్న సమయంలో హఠాత్తుగా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. నిన్న తెలంగాణలో 45 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

ఒక్క హైదరాబాద్ (Hyderabad) లోనే 18 కేసులు నమోదు కాగా రాష్ట్ర‌ వ్యాప్తంగా 27 కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రజలు (People) అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీ (Andhra Pradesh)లో నిన్న ఒక్క రోజు 54 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20 కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6 కేసులు, చిత్తూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాలన్నీ కలిపి మరో 15 కేసులు నమోదయ్యాయి. కరోనా పరిస్థితులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించి, అందుకు తగ్గ ఏర్పాటు చేయించింది. కాగా వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు.

Also Read: Former Deputy CM: కర్ణాటకలో ఎన్నికలకు ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం