Site icon HashtagU Telugu

BC Reservations : బీసీలకు తెలంగాణలో 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..ఆర్ కృష్ణయ్య డిమాండ్.!!

R Keishaniah

R Keishaniah

తెలంగాణలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించారో…బీసీలకు కూడా 29 శాతం నుంచి 50శాతం కల్పించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య. రంగారెడ్జి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌.కృష్ణయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో, పంచాయతీరాజ్ లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఎవరూ నిద్రపోవద్దన్నారు. బీసీలు అందరూ ఐక్యంగా ఉండి…రిజర్వేషన్ల కోసం చట్టసభల్లో పోరాడుదామన్నారు.

ప్రపంచ నాగరికతకు పునాది వెదురు అన్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం వల్ల వెదురు వృత్తి దెబ్బతిన్నదన్నారు. పుట్టినప్పటి నుంచి కాటివరకు వెదురు, మేదరులు లేనిది జీవనం ముందుకు సాగడం కష్టమన్నారు. కులాభివృద్ధిలో చదువు కీలకమన్నా ఆయన. పుట్టినప్పటి నుంచి పుట్టెడు కష్టాలతో మేదరి కులం ఉందని అన్నారు. సమాజానికి ఉపయోగపడే కులవృత్తులు చేస్తున్న కులాలకు ప్రభుత్వాలు ఏం ఇచ్చాయంటూ ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నించారు. ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడే సమస్యలకు పరిష్కారం దొరకుతుందన్నార. ప్రతి కులాభివృద్ధిలో చదువు కీలకమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు వేల హాస్టళ్లు ఉన్నాయన్న ఆయన.. గురుకులాల కోసం కొట్లాడితే 1,200 గురుకురాలు మంజూరయ్యాయన్నారు.