Site icon HashtagU Telugu

Telangana – BC Survey : వచ్చే నెల నుంచి తెలంగాణలో ‘బీసీ సర్వే’.. ఎందుకంటే ?

Telangana Bc Survey

Telangana Bc Survey

Telangana – BC Survey : రాష్ట్రంలోని బీసీ కులాల రాజకీయ ప్రాతినిధ్యంపై అక్టోబర్‌లో సర్వే చేపట్టాలని తెలంగాణ సర్కారు డిసైడ్ అయింది.  దీని ఆధారంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో బీసీలకు నిర్ణీత రిజర్వేషన్లు లేవు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల సిబ్బంది సహకారంతో బీసీ సర్వేను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. ఈ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తుంది. ఇలా సేకరించే సమాచారంతో కూడిన డేటాను విశ్లేషించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోసం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (TSTS) ఒక సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తోంది. దీనిపై ఈనెల 25 నుంచి నాలుగు రోజుల పాటు పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో కీలక సమావేశం జరగనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఈ సర్వేలో భాగంగా గ్రామం, మున్సిపల్ డివిజన్, వార్డులో బీసీ జనాభా, బీసీ ఓటర్ల శాతం, విద్యార్హతలు, బీసీల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితి వంటి విభిన్న ప్రశ్నలను సర్వే సిబ్బంది అడుగుతారు.

Also read : Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లను నిర్ణయించే పనిలో బీసీ కమిషన్ నిమగ్నమైందని కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మీడియాకు చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ట్రిపుల్ టెస్ట్, కఠినమైన, అనుభవపూర్వక విచారణ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు ట్రిపుల్ పరీక్షను పాటించడంలో విఫలమయ్యాయని, బీసీ రిజర్వేషన్లను అమలు చేయలేకపోయాయని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ ట్రిపుల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాయని కృష్ణమోహన్ రావు చెప్పారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనే దానిపై రీసెర్చ్ రిపోర్టును  రాష్ట్ర సర్కారుకు (Telangana – BC Survey) అందిస్తామని తెలిపారు.

Exit mobile version